- కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ
ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆగస్టు 9న జరిగే మహాధర్నా కరపత్రాన్ని ప్రజా సంఘాల నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ.. కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9 వేలు ఇవ్వాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కేంద్ర సంస్థలలో 13 లక్షల ఖాళీ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని, ఉపాది హామీ పధకాన్ని 200 రోజులకు పెంచి, రోజుకు 600 చెల్లించాలని కోరారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అసంఘటితరంగ కార్మికులైన హమాలి, ఆటో ట్రాన్స్ పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. గత ఆరేళ్ల నుండి కేంద్ర బిజెపి ప్రభుత్వం ముందు కేంద్ర కార్మిక సంఘాలు పెట్టిన డిమాండ్లలో ఒక్కటి కూడా మోడీ ప్రభుత్వం పరిష్కరించలేదని కాబట్టే మోడీని గద్దెదించండి - దేశాన్ని కాపాడండి అనే రాజకీయ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, టిఎన్టియుసి నాయకులు వీర్రాజు, ఐ ఎఫ్ టి యు నాయకులు జె వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పిఎస్ నారాయణ, ఎం.ఎస్.నారాయణ, పెద్ద పండు, రాజు, ఐ.ఎన్.టి.యు.సి నాయకులు కె.భవాని, వారేమ రమణ, మరియమ్మ, మంగమ్మ, ఐఎఫ్.టియు నాయకులు బొడ్డు సత్యన్నారాయణ మూర్తి, శ్రీపాదం సత్తిబాబు, గరగ దుర్గబాబు, నాని తదితరులు పాల్గొన్నారు.










