Sep 12,2023 15:39

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయులకు ఈ నెల 13,14,15 తేదీలలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ప్రాంతియ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌-2023 గోడపత్రికను మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ శిక్షణ తరగతుల్లో జాతీయ బాలల సైన్స్‌ కాంగెస్‌లో ప్రాజెక్టులు చేయు విధానం గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్ధం చేసుకోవడం అనే ప్రధానాంశము నందు సైన్స్‌ ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. జిల్లాలో మూడు ప్రాంతాలలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. కాకినాడ పి.ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీప్రకాష్‌ శినర్జి స్కూల్‌, పెద్దపురం, ఎస్‌.వి.వి.డి.ఓ.హెచ్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల, అన్నవరం నందు నిర్వహంచడం జరుగుతుందన్నారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని డిఈవో కోరారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం లో కాకినాడ మండల విద్యాశాఖాధికారి సి.హెచ్‌ రవి, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి వెంకట్రావు, జిల్లా సైన్స్‌ అధికారి ఎమ్‌. శ్రీనివాస్‌ వినీల్‌, సమగ్ర శిక్ష ఐ.ఇ కోఆర్డినేటర్‌ చామంతి నాగేశ్వరరావు, గవర్నమెంటు ఉన్నత పాఠశాల, జగ్గంపేట ప్రధానోపాధ్యాయులు టి. రంగారావు, నూకరాజు, పట్టబి, బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయ కర్త కేసరి శ్రీనివాసరావు, జిల్లా సైన్స్‌ అధికారి ఎమ్‌.శ్రీనివాస్‌ వినీల్‌, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ కె.వెంకటరావు, రిసోర్స్‌ పెర్సన్స్‌ కె.వి.కె మహేశ్వర రావు, బి.సత్య ప్రసాద్‌, పి.కుమారస్వామి పాల్గొన్నారు. ఇతర వివరాలకు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయ కర్త కేసరి శ్రీనివాసరావు 9912703697 ను సంప్రదించవచ్చన్నారు.