Nov 15,2023 19:23

గతేడాది నవంబర్‌ 15న కృష్ణ కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో బుధవారం ఆయనను స్మరించుకుంటూ అభిమానులు, కుటుంబసభ్యులు, ప్రముఖులు కృష్ణకు నివాళ్లు అర్పించారు. మహేష్‌ బాబు, కుటుంబం హైదరాబాద్‌లో సంస్మరణదినం నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రికి నివాళులు అర్పిస్తూ మహేష్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.