దారితప్పి కొందరు తప్పిపోయారు.
దారిలేక కొందరు తప్పించుకున్నారు.
పేరుతెలియని ఒకచోట
వారూ వీరూ ఎదురయి
తమ పూర్వత్వాన్ని కలవరించి
కలతనవ్వుతో కరచాలనమయ్యారు.
మోసుకుని వచ్చిన జ్ఞాపకాల్నీ
గుండెనంటిన రూపాల్నీ
మనసుపొరల్లో రహస్యాల్నీ
బహిరంగంగా ఎదుట పరచుకున్నాక
తేలికై కాగితంలా ఎగిరిపోయామనే అనుకున్నారు.
గాలినంటిన రహస్యాలు కరిగిపోయాయి.
నేలకంటిన బరువు మిగిలిఉంది.
చేసేదేం లేక,..
వ్రేల్లాడుతున్న భుజాలతో
ప్రోగుచేసుకున్న కొమ్మలతో
కొత్త ఇల్లు కట్టుకున్నారు కానీ...
పాత ఇల్లులా మిగిలిపోయారు.
బండి అనురాధ