
మచు పిచ్చు (Machu Picchu) అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల (7,970 అడుగులు) ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకాస్ సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ప్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. ఇది 80 కిలోమీటర్ల దూరంలోని (50మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్ర లోయపైన ఒక పర్వత శిఖరంపై ఉన్నది. దీనిద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తున్నది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచు పిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438-1472) కోసం నిర్మించబడిన ఒక ఎస్టేట్ వంటిదని నమ్ముతారు. తరచుగా పొరపాటుగా ''లాస్ట్ సిటీ ఆఫ్ ది ఇంకాస్''గా సూచిస్తారు. ఇది బహుశా ఇంకాస్ నాగరికతకు అసలైన చిహ్నం. ఇది స్థానికంగా పేరు గడించినప్పటికీ, అమెరికా చరిత్రకారుడు హిరం బింగం 1911లో అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చేంత వరకు దీని గురించి ప్రపంచానికి తెలియదు. అప్పటి నుండి మచు పిచ్చు ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది. మచు పిచ్చు 1981లో ఒక పెరువియన్ చారిత్రాత్మక అభయారణ్యంగా, 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. 2007లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్‌లో ప్రపంచ న్యూ సెవెన్ వండర్స్‌లో ఒకటిగా మచు పిచ్చుకి ఓటింగ్ జరిగింది. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మచు పిచ్చుకు పర్యాటకులను ప్రభుత్వం 2023 జనవరి 21 నుంచి అనుమతించడం లేదు.