ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆసుపత్రి సూపర్డెంట్ లింగన్న అధ్యక్షతన వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొందరి వైద్యుల నిర్వాహకం వల్ల చెడ్డ పేరు వస్తుందని పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనానరు. రోగులకు బెడ్ల కొరత రాకుండా, ప్రత్యామ్నాయంగా మంచాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










