Aug 05,2023 16:13

ప్రజాశక్తి-అమరావతి (గుంటూరు) : అమరావతి-బెల్లంకొండ డబల్‌ లైన్‌ రోడ్లను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు శనివారం పరిశీలించారు. జూపూడి మునగోడు మధ్య జరుగుతున్న పనులను పరిశీలించి నాణ్యత తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. ఇరు మండలాలను కలుపుతూ 149 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రోడ్డు పనులను నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.