Jul 31,2023 12:42

ప్రజాశక్తి - చాపాడు (కడప) : మండల పరిధిలోని అల్లాడుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆర్‌ బి కే భవనాన్ని సోమవారం సర్పంచ్‌ గోసుల కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎస్‌ రఘురామి రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వ సలహాదారులు ఈ తిరుపాల్‌ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను అమలుపరిచి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను అన్ని రకాల హంగులతో నిర్మిస్తుందన్నారు. రైతులకు కావలసిన ఎరువులు, మందులు ఆర్బికెలలో అందుబాటులో ఉంటున్నాయన్నారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని రెండు కార్లు పండించుకునేందుకు నీటి సరఫరా చేపడుతున్నామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కు వరద నీరు వచ్చి చేరుతోందని ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో కేసికి నీరు విడుదల చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఎంపీపీ లక్ష్మయ్య, ఎంపీడీఓ శ్రీధర్‌ నాయుడు, ఏఓ మ్యాగీ, పంచాయతీరాజ్‌ ఏఈ ఈశ్వరయ్య, ఈఓపీఆర్డి రాధాకఅష్ణ వేణి, వైసిపి మండల కన్వీనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైసీపీ నాయకులు నారాయణరెడ్డి, పివి రమణారెడ్డి, వినరు కుమార్‌ రెడ్డి, చంద్ర మోహన్‌ రెడ్డి, ఉదరు కుమార్‌ రెడ్డి, స్థల దాతలు గోసుల యల్లారెడ్డి, బాల వీరారెడ్డి, శేషారెడ్డి, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.