ప్రజాశక్తి-విజయనగరం కోట : నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రెండో కౌన్సిలింగ్ ఎంబిబిఎస్ అడ్మిషన్స్ తక్షణమే రద్దు చేయాలని డిసిసి అధ్యక్షులు రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌కి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రెండో కౌన్సిలింగ్ ఎంబిబిఎస్ అడ్మిషన్స్ తక్షణమే రద్దుచేసి.. నష్టపోయిన రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిబంధన మేరకు మొట్టమొదటి ఓపెనింగ్ కేటగిరి సీట్లను కేవలం ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలి అటువంటి అప్పుడు 54 వేల ర్యాంకు పొందిన బీసీ అభ్యర్థికి రిజర్వేషన్ కేటగిరి సీటు కేటాయించి, 62,000 ర్యాంకు పొందిన అభ్యర్థికి ఓపెనింగ్ కేటగిరిలో ఏ విధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. నిబంధనల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ట్రైనింగ్ సల్ చైర్మన్ శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు సుంకర సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ శ్రీనివాసరావు, జమ్మ ఆదినారాయణ, మైనార్టీ విభాగానికి చెందిన కరీం షరీఫ్, పైడ్రాజు సూర్యనారాయణ, మువ్వల శ్రీనివాసరావు, రాజ వర్ధన్, రాధాకృష్ణ , తెలుగు సూరిబాబు, గురువులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










