జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా) : చేపల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలైన ఘటన శుక్రవారం జీలుగుమిల్లిలో చోటుచేసుకుంది. కర్నాటక నుండి రాజమండ్రి వైపుకు చేపల లోడుతో వెళుతున్న లారీ జీలుగుమిల్లి మండలం లోని దర్భ గూడెం సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ లకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరినీ అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి జీలుగుమిల్లి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.










