
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : ఆటోను లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం కశింకోట జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో కసింకోటకు చెందిన మునగపాక లక్ష్మీ, బయ్యవరం కి చెందిన ఆటో డ్రైవర్ శనివాడ తలుపుల రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం 108 వాహనంలోఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.