Aug 26,2023 12:45

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టడంతో 20మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన శనివారం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం శివారు పులివాగు వద్ద జరిగింది. జంగారెడ్డిగూడెం నుండి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లికి 53 మంది ప్రయాణికులతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వెళుతుంది. కొయ్యలగూడెం మండలం బైనిగూడెం శివారు శివాలయం వద్ద రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టు వద్ద ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన సుమారు 20 మంది ప్రయాణికులను బయ్యనిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. కల్వర్టు వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.