Apr 29,2023 10:53

సామర్లకోట (కాకినాడ) : రోడ్డుపై లారీకి సడన్‌ బ్రేక్‌ వేయడంతో దాని వెనుకనే వస్తున్న కళాశాల బస్సు, ఆర్‌టిసి బస్సు ఒకదానివెనుక ఒకటి ఢకొీన్నాయి. రెండు బస్సుల డ్రైవర్లతోసహా కొందరు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం వేట్లపాలెం సామర్లకోట రహదారిపై జరిగింది. వేట్లపాలెం వైపు నుండి సామర్లకోట వైపు వస్తున్న ఒక లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న కళాశాల బస్సు లారీని ఢీకొట్టగా, కళాశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. లారీ కారణంగా జరిగిన ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లు తో సహా కొందరు విద్యార్థులు స్వల్ప గాయాలకు గురైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.