ప్రజాశక్తి-కాకినాడ : ఎస్‌ఎఫ్‌ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి బాలజీ చెరువు సెంటర్ వరకు 152 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు జి.రాము, ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ.. స్వాతంత్రం ఉద్యమ స్ఫూర్తితో నేటి విద్యార్థులు విద్యా, ఉపాధికై పోరాడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ల కాలంలో కూడా నేటికీ దేశంలో విద్య అందరికీ అందని ద్రాక్షగా తయారైందని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ కొఠారి కమిషన్ చెప్పినట్టుగా విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పిన నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి ఆ విధమైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్నికీ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని దేశంలో కుల, మత బేధాలు లేకుండా అందరూ ఒకే విధంగా ఉండే విధంగా ఉండాలని, దేశాన్ని మతోన్మాదుల నుండి కాపాడాలని ఉద్దేశంతో సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ రాజ్యాంగ, సేవ్ ఇండియా నినాదంతో ఆజాద్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు భారత స్వాతంత్ర ఉద్యమం, చరిత్రను చదవాలని భారతదేశానికి స్వతంత్రం రావాలని స్వాతంత్రం ఉద్యమంలో ప్రాణాలర్పించిన స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని వారి జీవితాలను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని, స్వాతంత్రం ఉద్యమ స్ఫూర్తితో అందరికీ విద్యా, ఉపాధి కోసం నేటి విద్యార్థులు, యువకులు స్వాతంత్రం ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు పి.వరహలు, నగర నాయకులు సాహిత్, వాసు, రవితేజ, అభిషేక్, చరణ్ తేజ్, సత్య, స్మైలీ తదితరులు పాల్గొన్నారు.











