నిన్నటి వార్తలన్నీ వెతికితే
నిజం కానరాలేదని
నిప్పు భగభగ మండుతున్నది.
ఎండుకొమ్మ మీద వాలిన
పక్షులన్నీ చిగురు కోసం
ఎదురుచూస్తుంటే ఆకాశంలో
మేఘము నవ్వుతున్నది.
గాయాలను దాచిన మాటలన్ని
గేయాలుగా కదలాడుతుంటే
వినలేని హృదయాలు
గాఢ నిద్రలోకి జారుకున్నాయి.
మనుషులే లేని ఇంటిలో
గదులన్ని ఖాళీలవుతుంటే
ఫుట్ పాత్ పై మెదిలే అనాధలు
జీవితతత్వాన్ని మోస్తున్నారు.
లేనిచోట
కనలేవు వినలేవు
ఎన్నటికీ కనుగొనలేవు ...
నువ్వు కూడా
అచ్చం అలాగే నువ్వులేని చోట
నిత్యం నీకోసం వెతుకుతూ
నిన్ను ఎన్నటికీ పొందలేవు....
రామ్ పెరుమాండ్ల
95422 65831