- ఇరిగేషన్ డి ఈ మంజునాథ్, తహశీల్దార్ లక్ష్మీనారాయణ
ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : తుంగభద్ర జలాశయ విభాగంలోని, ఆలూరు బ్రాంచ్ కాలువకు, అనధికారికంగా మోటర్లు పెట్టి సాగునీటి జలచౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డిఈ మంజునాథ్, తహశీల్దార్ లక్ష్మీనారాయణ రైతులకు తెలిపారు. మంగళవారం ఎంపీపీ జూటూరు హేమలత మారయ్య, ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు, ఆలూరు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులుతో కలిసి, చిప్పగిరి, ఏరూరు, మల్లికార్జున పల్లె, డేగలహాలు, గ్రామాలలో పర్యటించి, రైతులతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా డిఈ మంజునాథ్, తహశీల్దార్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆగస్టు నెలలో ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల అవుతున్నట్లు తెలిపారు. కాలువపై అనధికారికంగా రైతులు అక్రమమైన మోటర్లు పెట్టి నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. రైతులు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు. ఏబీసీ కాల్వ కింద ఉన్న ఆయకట్ట రైతులు, అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు, కాల్వకు నీటి పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు బ్రాంచ్ కెనాల్‌ఏఈ తిమ్మారెడ్డి, డేగల హాల్ సర్పంచ్ నీలకంఠ, రైతులు పోతున్న, ధనుంజయ, లాల్ స్వామి, లింగన్న, తోపాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.










