
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : బార్ అసోసియేషన్ వద్ద సోమవారం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు తరిగోపుల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ తప్పుడు సాక్షాలతో చంద్రబాబును కటకటాలకు పంపడం కొందరికి పైశాచిక ఆనందం కావచ్చు కానీ అది తాత్కాలికమే అని అన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ న్యాయవాదులు కృష్ణ కుమార్, వెలగచర్ల వెంకట సుబ్బయ్య, కందుల వెంకట రమణ, మన్నేరు వెంకట సుబ్బయ్య, జల్లి నారాయణ, బసినేని రమేష్, కత్తి సుబ్బారాయుడు, వెంకటేశ్వర్లు, రెడ్డి శివ, మల్లికార్జున, నాగేశ్వర్, కోటేశ్వర, మోహన్, యు.వి.రమణ, నాగేంద్ర, గిరీష్ కుమార్, సూర్య ప్రకాష్, కోటేశ్వర్ రావు, అక్షరు కుమార్, రాజా రెడ్డి, టి.సూర్య చైతన్య, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.