హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో నాల్గోసారి కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఆర్‌టి4జిఎం. మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ సినిమా నిర్మించనున్నారు. రవితేజ,సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్, ఇతర టీమ్ సభ్యులు, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం జరిగాయి. స్క్రిప్ట్‌ని అల్లు అరవింద్‌కు నిర్మాతలు అందజేశారు. ముహూర్తం షాట్‌కు అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ క్లాప్ ఇచ్చారు. తొలి షాట్‌కి కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నటుడిగా మారిన ఫిల్మ్ మేకర్ సెల్వరాఘవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇది ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా. ఇందూజ రవిచంద్రన్‌ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.