దీపావళి సందర్భంగా రజినీకాంత్ నటిస్తున్న 'లాల్ సలామ్' చిత్రం నుంచి చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు మధ్య ఘర్షణలు జరిగినప్పుడు జరిగిన నష్టం ఏంటి? క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్దరు యువకులు.. వారిలో ఒకరు హిందు, మరొకరు ముస్లిం. క్రికెట్ ఆటలో ఒకరిపై ఒకరు పోటీ పడే సన్నివేశాలు, దాని వల్ల వారిద్దరూ మతం పేరుతో గొడవలు పడే సన్నివేశాలను ఈ టీజర్లో చూపించారు. 'ఆటలో మతాన్ని చేర్చారు. అంతే కాకుండా పిల్లల మనసుల్లో విషాన్ని నింపారు' అని అక్కడున్న పెద్దలను మొయిద్ధీన్ పాత్ర తిడుతుంది. అలాగే హిందు, ముస్లింలు గొడవ పడుతున్నప్పుడు.. మొయిద్దీన్ భారు ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మెయిద్దీన్ పాత్రలో రజినీకాంత్ కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, కపిల్ దేవ్ తదితరులు నటించారు.