Oct 01,2023 19:32

అగ్ర హీరోలతో భారీ బడ్జెట్‌ సినిమాలను నిర్మించటంతో పాటు డిఫరెంట్‌ కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌. ఈ బ్యానర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి 'లాల్‌ సలాం'. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో ముంబై డాన్‌ మొయిద్దీన్‌ భాయ్ గా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తుండటం విశేషం. రజినీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్‌, క్రికెట్‌ లెంజెండ్‌ కపిల్‌ దేవ్‌ తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. రీసెంట్‌గా జైలర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన తలైవర్‌ ఇప్పుడు 'లాల్‌ సలాం'తో సంక్రాంతికి అలరించనుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా...లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ''సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌గారితో మా అనుబంధం కొనసాగుతుండటం మాకెంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. మా రిక్వెస్ట్‌ మేరకు ఆయన ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ లెవల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్‌, కపిల్‌ దేవ్‌ తదితరులు నటించారు.