Nov 16,2022 22:10

కువైట్‌ సిటీ : కువైట్‌ బుధవారం ఏడుగురిని ఉరి తీసింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 2017 తర్వాత కువైట్‌లో ఉరిశిక్షలను అమలు చేయడం ఇదే ప్రథమం. ఉరితీయబడిన వారిలో ముగ్గురు కువైట్‌ జాతీయులు, ఒక సిరియన్‌, ఒక పాకిస్తానీ వుండగా, మహిళల్లో ఒక ఇథియోపియన్‌, ఒక కువైట్‌ జాతీయురాలు వున్నారని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 2017 జనవరి 25న చివరగా ఉరి తీయబడిన వారిలో రాజకుటుంబానికి చెందిన సభ్యురాలితో సహా ఏడుగురు ఉన్నారు. అమానవీయమైన శిక్షగా అభివర్ణిస్తూ తక్షణమే ఈ ఉరితీతలను ఆపాలని మంగళవారం రాత్రి అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.