కువైట్ సిటీ : కువైట్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. షేక్ అహ్మద్ నవాఫ్ అల్‌ాఅహ్మద్ అల్-సబా నేతృత్వంలో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. 2022 జులై 24న అల్ అహ్మద్ అల్ సబా ప్రధానమంత్రిగా ఎన్నికైన నుంచి ఆయన ఏర్పాటు చేసిన ఐదో ప్రభుత్వం ఇది. కొత్త ప్రభుత్వంలో 15 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఐదుగురు తొలిసారిగా మంత్రులుగా నియమితులయ్యారు. ఈ నెల 7న గత ప్రభుత్వం రాజీనామా చేసింది. రాజీనామాను ఆ దేశ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాకు సమర్పించింది. దీంతో ప్రధానమంత్రిగా షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా ప్రధానమంత్రిగా మళ్లీ నియమించేందుకు ఈ నెల 13న రాజ శాసనం జారీ చేయబడింది.










