Feb 14,2023 13:02

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : కర్నూలు జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును నామకరణం చేయాలని నల్లా రెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కేదార్‌ నాథ్‌ అన్నారు. దామోదరం సంజీవయ్య 102వ జయంతోత్సవం సందర్భంగా ... కర్నూలు, నంద్యాల రోడ్డు చెక్‌ పోస్ట్‌ మూడు రోడ్ల కూడలి సమీపంలోని దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌ మాట్లాడుతూ ... కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని, దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడులో స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లారెడ్డి ఫౌండేషన్‌ సభ్యులు వసంత్‌, జశ్వంత్‌, ఆదిశేషు, మధు తదితరులు పాల్గొన్నారు.