కర్నూల్ స్పోర్ట్స్ : తిరుపతి కేంద్రంగా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ హ్యాండ్ బాల్ పోటీలలో కర్నూలు జిల్లా జట్టు కడప జట్టుపై 38-22 గోల్స్ తేడాతో గెలుపొంది విజయకేతాన్ని ఎగురవేసిందని జిల్లా సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్రా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ప్రధాన శిక్షకులు నటరాజరావు శుక్రవారం తెలిపారు. కర్నూల్ జిల్లా హాండ్ బాల్ జట్టు చక్కటి ప్రతిభ కనిపరిచి విజయాలు సొంతం చేసుకుంటూ రాష్ట్రంలో గట్టి పోటీ ని ఇస్తుందని అని జిల్లా కార్యదర్శి రుద్ర రెడ్డి అభినందించారు. ఈ విజయం పట్ల సీఈఓ రమణ, ఒలింపిక్ కార్యదర్శి శ్రీనివాసులు, ఒలింపిక్ సీఈఓ విజయ కుమార్, పలువురు క్రీడ సంఘంల నేతలు ప్రశంసల వర్షం కురిపించారు.










