హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై పరిశీలన కోసం నిపుణుల కమిటీని కేంద్ర జలశక్తి శాఖ నియమించింది. బ్యారేజీ కుంగడాన్ని కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించి ... నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించనుంది. జలాశయాన్ని పరిశీలించిన వెంటనే నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలనిచ్చింది.