పచ్చగా చిగురులు వేస్తున్న తోటలో
కంటికి కనిపించని సూక్ష్మక్రిములు
మాటువేసుకున్నాయని అనుకోలేదు
తీగలు పాదుకు అల్లుకునే తరుణంలో
ఉన్మాద చీడ పీడ పట్టి
అందంగా అల్లుకుంటూ
ఆనందంగా నాట్యం చేస్తున్న
కొన్నితీగలను తొలిచేస్తోందని..
అంతే... ఓ లేతీగ
చీడ చేసిన ఆ దారుణానికి
కొయ్యబారి స్థాణువై పోయింది
గుండెలో ఎగిసి పడుతున్న
మంటలను తట్టుకోలేక
మూగగా కుమిలి కుమిలి రోదిస్తోంది
ఆ అందమైన తోటలో
ఇంతటి కిరాతక క్రిములుంటాయని
మెత్తని కత్తితో కుత్తుకలు కోస్తాయని
కలలో కూడా అనుకోలేదు
చక్కని స్నేహలతను తొలిచేస్తుందని
నిర్వీర్యం చేస్తుందని..
మళ్లీ చిగురించదా !
ఆ తీగ ఏనాటికైనా !
పీడించే చీడను తరిమికొట్టక మానదా !!
తీగలన్నింటితో కలసి
కొత్తచిగుళ్లు వేసి
పచ్చని పొదరిల్లు చెయ్యదా...?
కాలమెప్పుడూ ఒకేలాగుండదుగా !?
నాగముని యం,
94908 56185