Oct 06,2023 19:25

'తొలిప్రేమ' చిత్రంలో పవన్‌కళ్యాణ్‌కి జోడీగా నటించిన కీర్తిరెడ్డి త్వరలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. గన్‌ షాట్‌, ప్రేమించే మనసు, రావోయి చందమామ చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. 'అర్జున్‌'లో మహేష్‌కు సోదరి పాత్ర పోషించారు. వివాహం తరువాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. తాజాగా కీర్తిరెడ్డి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు దర్శకులు ఆమెను సంప్రదించినట్టు చర్చ నడుస్తోంది.