
కీడాకోలా సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని హీరో రానా దగ్గుపాటి అన్నారు. బుధవారంనాడు ఆయన హైదరాబాద్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ 'మేము అనుకున్న కథని బలంగా నమ్మి, కథనానికి కట్టుబడి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. తరుణ్ భాస్కర్ కూడా లాంటి అరుదైన దర్శకుడు. ఒరిజినల్ సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ లాంటి ఫిల్మ్ మేకర్ తెలుగు పరిశ్రమలో వుండటం ఒక గౌరవంగా భావిస్తాను. కీడా కోలా చిత్రాన్ని తరుణ్ చూపించినపుడు చాలా నవ్వుకున్నాను. ప్రేక్షకుల కూడా ఎంజారు చేస్తారనే నమ్మకం వుంది. ఎప్పుడూ చూడని కొత్త నటీనటులని ఇందులో చాలా కొత్తగా చూస్తాం. నవంబర్ 3న సినిమా వస్తోంది. అందరూ చూడండి. తప్పకుండా ఎంజారు చేస్తారు' అన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా 'కీడా కోలా'ను తీశారు. బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజరు, జీవన్ కుమార్, విష్ణు, తరుణ్ భాస్కర్, చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్ తదితరులు తారాగణం.