
తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం 'కీడా కోలా'. తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్‌లను విడుదల చేశారు. తాజాగా చిత్రబృందం ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చింది. 'డిపిరి డిపిరి' అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. ఈ పాటకు భరద్వాజ్ లిరిక్స్ అందించగా, హనుమాన్ పాడారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్నారు.