Oct 30,2023 19:06

విజి సైన్మా బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నంబర్‌ 1గా రూపొందుతున్న 'కీడా కోలా' చిత్రాన్ని కె. వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కిస్తున్నారు. నవంబర్‌ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజరు దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాల విషయంలో చిన్న భయం వుండేది. థియేటర్‌ బయటే తిరిగేవాడిని. కీడా కోలా విషయంలో ఆ భయం లేదు. క్రైమ్‌ కామెడీ నా ఫేవరేట్‌ జోనర్‌. ఈ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఫీలౌతున్నాను. ఈ సినిమా మా గురించి కాదు ప్రేక్షకుల గురించి డిజైన్‌ చేశాం. ఎన్ని సమస్యలున్నా నవ్వు కలిగించాలనే ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో అన్నీ రకాల హాస్యం వుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు నటించడం మా అదృష్టం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నవ్వుతారు. మీరు నవ్వితే మేము హ్యాపీ. నవంబర్‌ 3 మీ ప్రాబ్లమ్స్‌ మర్చిపోండి, నవ్వుకోండి' అని ఈ సందర్భంగా దర్శకుడు సినిమా విశేషాలు ముచ్చటించారు.