Jul 23,2023 15:48

రాబోయే ఎన్నికల్లో..
దూకుడు పెంచడానికి..
రెచ్చిపోయి మత్తులో ముంచడానికి..
నోట్లను కుక్కి ఓట్లు లాగుతూ..
ప్రజాస్వామ్యాన్ని మింగేయడానికి..
బడుగుల బలహీనతలే పెట్టుబడిగా..
ఓటర్లను బుసకొట్టి భయపెడుతూ..
ఓటరును వివశుణ్ణి చేస్తున్నది !
ఓట్ల పండుగ రాక కోసం..
బూత్‌ల వారిగా బూతు దుకాణాలు..
దోచి దాచిన కట్టల గుట్టలు..
బస్తాల్లో డబ్బు కట్టలు ఊపిరాడక..
చీకట్లో మూలుగుతున్న నల్లధనం..
ఓట్ల అదనుచూసి జూలు విదిల్చి
కట్టల పాములు కాటేయడానికి..
పడగ విప్పి కాటేయుటకు కాచుకుంది !
దుర్రాజకీయమే నిలువెత్తు విషంగా
ధనస్వామ్యం దరహాసం చేయగా..
స్వస్తిక్‌ ముద్రను వశపరుచుకొని..
గెలుపుతో పంచవర్ష ప్రణాళికలు..
వేల కోట్లు కుమ్మేయడానికి..
ఓటర్ల కోరికల్ని పాతరేసి
కొనేటోళ్లకు సిగ్గూశరం లేదు..
అమ్ముకునేటోళ్లకు ఆకలి దూరం కాదు !

డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037