Jun 03,2023 12:04

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామిని కర్నాటక రాష్ట్ర జలవనరుల శాఖలోని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ఎస్‌.బోసరాజు శనివారం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయనకు మఠం మేనేజర్‌ యస్కే శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీపతి ఆచార్య, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రుని మూల బఅందావనాన్ని మంత్రి దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు ఆయన్ను కుశల ప్రశ్నలు వేసి శేష వస్త్రం ఫల మంత్రాక్షతలు మెమొంటో అందజేసి ఆశీర్వదించారు.