ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన సూర సత్యనారాయణ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులతో కలిసి అరుణ్ కుమార్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గుడివాడ సాంబశివరావు, పాములపాటి రమేష్, కర్రి రవీంధ్ర, సూరా కొండలరావు పాల్గొన్నారు.










