భీకర వర్షాల విలయానికి
తెలుగునేల కన్నీటి కడలైంది
బీభత్స వరదల తాకిడికి
జనజీవనం అస్తవ్యస్తమైంది
ఇపుడు
సర్వస్వం వర్షార్పణమై
రోదనలు మిన్నంటినరు
పంట చేలు జలపరమై
రైతు గుండెలు బోరుమన్నరు
అంతటా విషాదం కమ్మింది
ఒడువని దుఃఖం మిగిలింది
ఈ విపత్కర పరిస్థితిలో
పాలకులపై భారం మోపి
మనం తప్పుకుంటే తగదు
మనుషులుగా అందరూ
స్పందించాల్సిన సందర్భం
బాధితులకు బాసటగా
నిలవాల్సిన సమయం
అన్నదాతలకు భరోసా
కల్పించాల్సిన తరుణం
అందుకే.. అందరం
ఉదాత్త రూపునెత్తుదాం
మసకబారిన బతుకుల్లో
ఉద్దీపన దీపం వెలిగిద్దాం
మోడుబారిన ఎదలో
నిబ్బర నదులు పారిద్దాం
సన్నగిల్లిన బతుకుల్లో
సరికొత్త ఊపిర్లు పోద్దాం
మూగబోయిన గళాల్లో
నవవసంత రాగం పలికిద్దాం
కోడిగూటి తిరుపతి
95739 29493