
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌కు చెందిన దంపతులు ఐఫోన్ కొనేందుకు కన్నకొడుకునే అమ్మేశారు. రీల్స్ చేసేందుకు ఎనిమిది నెలల పసికందును విక్రయించారు. నిందితులను కోల్‌కతాకు చెందిన జయదేవ్, సతిగా పోలీసులు గుర్తించారు. వీరికి ఏడేళ్ల కూతురు కూడా ఉంది. గత శనివారం కుమారుడిని విక్రయించిన ఆ దంపతులు.. అనంతరం ఖరీదైన ఐఫోన్‌ను కొనుగోలు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి రీల్స్ చేశారు. అయితే రోజు గడవడమే కష్టంగా ఉండే ఆ దంపతుల చేతుల్లో ఖరీదైన ఐఫోన్ ఉండటం, కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానమొచ్చింది. దీంతో వారు భార్యాభర్తలను నిలదీయగా, డబ్బు కోసం కుమారుడిని విక్రయించినట్టు అంగీకరించారు. జయదేవ్‌తోపాటు బిడ్డను కొనుగోలు చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.