ప్రజాశక్తి - యానాం(కాకినాడ) : గౌతమి గోదావరిలో దూకి గల్లంతయిన మందంగి కాంచన (22) ఆత్మహత్య చేసుకన్న విషయం తెలిసిందే. ఆమె మృతదేహం కనకాల పేట పుష్కర ఘాట్ సమీపంలో లభ్యమైంది. ఈ ఘటనపై ఎస్‌ఐ శేరు నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఫెర్రీ రోడ్డుకు చెందిన యువతి మందంగి కాంచన (22) ఈనెల 16న రాత్రి జీఎంసీ బాలయోగి వారధి పైనుంచి గౌతమి గోదావరిలో దూకింది. ఈ మేరకు పోలీసులు మంగళవారం ఉదయం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా కనకాల పేట పుష్కర ఘాట్ సమీపంలో కాంచన మతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.










