చింతచిగురుకు ఎంత
పులుపు ఉంటదో
కాళోజీ కలానికి కూడా
అంతే పొగరు ఉంటుంది..!
వెనుతిరుగని వైనం
వైతాళిక దర్శనం
నిలువెత్తు నిదర్శనం
కాళోజి కలం..!!
నరనరాన ఏ సిరా
ప్రవహించిందేమో
ప్రతి అక్షరం
ప్రజల పక్షమే నిలిచింది..!!
కవిత్వమే సమాజాన్ని
మేల్కొలుపుతుంది
అన్న నానుడి నుండి
సమాజమే కవిత్వానికి
పునాది అన్న కాలోజీ కలం
చరిత్రను తిరగరాసింది..!!
తెలుసుకోలేని అంతర్మధనం
అణువణువునా ఆదర్శం
వర్తమానాన్ని అనువర్తనం
చేసిన కాళోజి కలం..!!
పోరుడి నుండి
పౌరుడిని నిలబెట్టిన
కలానికి ఉన్న పదునే
కాళోజీ కలం..గళం..దళం..బలం..
నాగరాజు సాలం
94937 45453