Oct 08,2023 12:10

ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్‌) : రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు నందిగామ కాకతీయ - అపోలో విద్యార్థులు ఎంపికైనారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన పెనమలూరు, బ్లూమింగ్‌ డెల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో అండర్‌ -14 , అండర్‌ -17 బాలబాలికల ఉమ్మడి కృష్ణాజిల్లా సిమ్మింగ్‌ జట్టును ఎంపిక చేశారు దీనిలో కాకతీయ - అపోలో విద్యార్థులు అండర్‌ -14 విభాగంలో కామా ప్రభు సాత్విక్‌ (ఫ్రీ స్టైల్‌ 50 మీటర్స్‌ , బ్రెస్ట్‌ స్ట్రోక్‌ 50 మీటర్‌ ), సతరాజుపల్లి కీర్తన్‌ ( ఫ్రీ స్టైల్‌ 50 మీటర్స్‌, 100 మీటర్స్‌ , బ్యాక్‌ స్ట్రోక్‌ 50 మీటర్స్‌) విభాగంలో ఎంపికైనారు. అండర్‌- 17 విభాగంలో బోడావుల వరుణ్‌ సాయి (బ్యాక్‌ స్ట్రోక్‌ 50 మీటర్స్‌, ఫ్రీ స్టైల్‌ 50 మీటర్స్‌) విభాగంలో ఎంపికైనారు. అండర్‌ -19 విభాగము నందు కాకతీయ హెల్త్‌ క్లబ్‌ తరఫున చల్లా దీపక్‌ (50 మీటర్స్‌ బటర్ఫ్లై , 50 మీటర్స్‌ బ్యాక్‌ స్ట్రోక్‌ ) విభాగము నందు ఎంపికైనారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు పైన తెలిపిన కేటగిరిలో ఎంపిక అయ్యారని జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సమైక్య కార్య నిర్వాహక కార్యదర్శి తోట అజరు కుమార్‌ తెలిపారు. విద్యార్థులను, శిక్షణ నిర్వాహకులు ఆకుల గోపీచంద్‌ ను పాఠశాల చైర్మన్‌ కాపా రవీందర్‌ నాథ్‌ , డైరెక్టర్‌ కాపా కార్తికేయ అభినందనలు తెలియజేశారు.