
విజయవాడ : చేగువేరా మెమోరియల్ చెస్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వన్ డే స్టేట్ యు - 19 ఓపెన్ టోర్నమెంట్ ను నిర్వహించారు. అండర్ - 10 వరల్డ్ ఛాంపియన్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కుమారి ఎన్.ప్రియాంక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, పాపులర్ షూమార్ట్ చుక్కపల్లి అరుణ్ కుమార్ విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. చదరంగం మెదడుకు పదును పెడుతుందని, ఈ క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని, చెస్ క్రీడను పాఠశాలల్లో పాఠ్యాంశంగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 200 మందికి పైగా క్రీడాకారులు మొత్తం ఏడు రౌండ్లుగా ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సభ అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.