Jul 28,2023 14:35
  • సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవరుర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, డిప్యూటి చైర్మన్‌ జకీయా ఖానమ్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, తానేటి వనిత, అంబటి రాంబాబు, ఎపి కేశినేనినాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర గవరుర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌కుఅభినందనలు తెలిపారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోనుతిపై ఆంధ్రప్రదేశ్‌కుచీఫ్‌ జస్టిస్‌గా వచ్చారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకుర్‌ తమ్ముడే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌. జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ 1964 ఏప్రిల్‌ 25న జన్మించారు. 1989 అక్టోబరు 18న ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకునాురు. 2011లో సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 2013 మార్చి 8న జమ్ముకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ 10న బాంబే హైకోర్టుకుబదిలీ అయి సేవలు అందించారు.