ఒంగోలు : బిబిసి పై ఆదాయ పన్ను శాఖ దాడులను నిరసిస్తూ ... రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు కలెక్టరుకు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ గేటు వద్ద బయట నుంచి నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కు జర్నలిస్టులు వినతిపత్రాన్ని అందజేశారు.










