May 29,2023 13:02

గుంటూరు : ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జర్నలిస్టుల సమస్యలపై కోర్కెల దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం తెనాలి డివిజన్‌ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద జర్నలిస్టుల సమస్యలపై నిరసన ప్రదర్శన చేసి, అనంతరం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ వాణికి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు కనపర్తి రత్నాకర్‌, డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎం.రవికుమార్‌, డి కోటేశ్వరరావు, నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు ఎ. శ్యామ్‌ సాగర్‌ పి పున్నయ్య ఫెడరేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.