ప్రజాశక్తి-పెద్దాపురం (కాకినాడ) : గుర్రం జాషువా జయంతి సందర్భంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో జాషువా చిత్రపటానికి పూల మాలలు ఏసీ నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కోటపాడు ప్రధానోపాధ్యాయులు ఆర్.వెంకటేశ్వరరావు, కొత్త నాగేశ్వరరావు, పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరు దొరబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, మున్సిపల్ వైస్ చైర్మన్‌లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.










