Sep 02,2023 13:12

వాషింగ్టన్‌ : సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరుకున్నారు. అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్‌ భారత్‌కి చేరుకోనున్నట్లు వైట్‌ హైస్‌ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. సెప్టెంబర్‌ 8వ తేదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనున్నారని శ్వేతసౌథ ప్రకటన వెల్లడించింది. ఇక సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో జరగనున్న జి - 20 సదస్సులో బైడెన్‌ పాల్గొనున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటన తెలిపింది.
కాగా, జి20 శిఖరాగ్ర సమావేశంలో స్వచ్ఛమైన ఇంధన పరివర్తన, వాతావరణ మార్పులతో సహా ప్రపంచ సమస్యల్ని పరిష్కరించడానికి జి 20 దేశాల భాగస్వాములతో కలిసి బైడెన్‌ చర్చించనున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటన తెలిపింది.