
జర భద్రం బిడ్డో..!
ప్రజాస్వామ్యంలో
పడతావ్ బొక్కబోర్లా..!
ఒక్కో ఓటు విలువ
నువ్వప్పగించే ఐదేళ్ల పరిపాలన
నీకిచ్చే బిరియాని,
క్వార్టర్ బాటిల్ కావు
ఒక్కో ఓటు విలువ
నువ్వధిష్టింపజేసే
కనకపు సింహాసనం
నీ నోటికి తాళమేసే డబ్బు కట్టలు కావు
ఒక్కో ఓటు విలువ
నువ్వాశించే
మమతా, సమతలు
కంపుకొట్టే కులమతాల రంగులు కావు
ఒక్కో ఓటు విలువ
నువ్వు కలలుకనే
దేశాభివృద్ధి ఫలాలు
జెండాల మధ్య జరిగే
ఘర్షణలు కావు
జర భద్రం బిడ్డో!
నీ ఓటు వజ్రాయుధం
పడబోకు బొక్కబోర్లా..
ఒక్క ఓటు విలువ..
దేశ భద్రతకు మూలాధారం
దేశ క్షేమానికే తులాభారం
పేరూరు బాలసుబ్రమణ్యం
98492 24162