
మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న 'జపాన్' చిత్ర టీజర్ విడుదలకు సంబంధించి, అలాగే చిత్ర విడుదలకు సంబంధించి మేకర్స్ తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అతి త్వరలోనే టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ కార్తీ స్టిల్స్ ఉన్న పోస్టర్లను చిత్రబృందం విడుదలచేసింది. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్ విజరు మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.