తాను నటించిన తాజా చిత్రం జపాన్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చెప్పారు. హీరో కార్తికి ఇది 25వ చిత్రం. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. 'దీపావళి' కానుకగా ఈనెల 10న విడుదల కానుంది. అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు. 'రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. ఆయన ప్రతి సినిమా డిఫరెంట్‌గా వుంటుంది. కార్తి, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, డీవోపీ రవి వర్మన్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్.. ఇలా జపాన్ టీం చాలా పెద్దది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్‌గా కూడా చాలా ఆసక్తి చూపిస్తాను. కార్తి అద్భుÛతమైన నటుడు. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.