Oct 19,2023 19:05

కార్తీ హీరోగా, రాజు మురుగన్‌ దర్శకత్వంలో రాబోతున్న 'జపాన్‌' చిత్రం నుండి తాజాగా టీజర్‌ విడుదలైంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టీజర్‌లో అడ్వెంచరస్‌ యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు కార్తి డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించారు. అలాగే టీజర్‌లో సునీల్‌ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమాకి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.