సాయంత్రం నక్షత్రాల చుట్టుముట్టే చిట్టడవి నుండి,
అంచెలంచెలుగా రాత్రి దిగుతుంది
గాలి దగ్గరగా వెళుతుంది, అందువలన,
ఎవరో ప్రేమ మాట గొణిగినట్లు.
జైలు యార్డ్ యొక్క బహిష్కరించబడిన చెట్లు,
తలలు వంచి, చిత్రలేఖనలో నిమగ్నమై ఉన్నాయి
ఆకాశం యొక్క చీరపై నమూనాలు, స్కెచ్‌లు.
పైకప్పు భుజంపై మెరుస్తున్నది
వెన్నెల ఆప్యాయతతో వేసిన చేతి స్పర్శ
నక్షత్రాల మెరుపు ధూళిలో కరిగిపోయింది..
ఆకాశ నీలంపు కాంతి శోభతో కరిగిపోయింది.
ఆకుపచ్చ మూలల్లో, నీలం నీడలు వికసించి,
గుండెలో వలె విభజనల నొప్పి పెరుగుతుంది.
నిరంతరం ఆలోచన హృదయానికి భరోసా ఇస్తుంది..
ఈ క్షణంలో చాలా తడి జీవితం..
నిరంకుశత్వపు విషాన్ని రెచ్చగొట్టేవారు
ఈ రోజు లేదా రేపు విజయం సాధించరు..
కాబట్టి ఇప్పటికైనా కూడదీసుకుని లేవాలి..
- కెరటం
(ఫైజ్ అహ్మద్‌ఫైజ్ రాసిన 'ఎ ప్రిజన్ ఈవెనింగ్'కు అనువాదం)