వాషింగ్టన్ : సిక్కు కార్యకర్త హత్యపై భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి చర్చించినట్లు రొటీన్ ప్రకటనలే చేసినప్పటికీ, భారత్‌పై కెనడా చేసిన ఆరోపణల మీద వివరణ ఇవ్వడానికే జైశంకర్ ప్రయత్నించారని తెలిసింది. ఇప్పటికే కెనడా దర్యాప్తుకు సహకరించాల్సిందిగా భారత్‌ను అమెరికా కోరింది. అమెరికా తన సంప్రదాయ మిత్రదేశమైన కెనడావైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది. సిక్కు కార్యకర్త హత్యను సాధనంగా చేసుకుని భారత్ ప్రభుత్వాన్ని మరింతగా లొంగదీసుకునేందుకు యత్నిస్తోంది. ఇంత జరిగిన తరువాత కూడా మోడీ ప్రభుత్వం అమెరికా అంటకాగడానికే తాపత్రయ పడుతున్నది. బ్లింకెన్, జైశంకర్ భేటీలో ద్వైపాక్షిక అంశాలపైనే చర్చించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ విలేకర్లకు తెలిపారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జై శంకర్ న్యూయార్క్ నుండి వాషింగ్టన్ బయలుదేరి వెళ్లారు. మొదట అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌సులినాన్‌తో సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం రాత్రి బాగా పొద్దు పోయినతరువాత బ్లింకెన్‌తో భేటీ అయ్యారు.
కెనడాలో భారత దౌత్యవేత్తలను బెదిరించారు
అంతకుముందు న్యూయార్క్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్ర మంలో జైశంకర్ మాట్లాడుతూ కెనడా లోని భారత దౌత్యవేత్తలపై బెదిరిం పులు జరుగుతు న్నాయని, భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే శక్తులకు కెనడా పెద్దపీట వేస్తోందని ఆరోపిం చారు. భారత రాజకీయాల్లో బహిరం గంగా జోక్యం చేసుకోవాలనే సూచనలు కూడా వివిధ కేంద్రాల నుంచి వస్తున్నాయని ఆయన అన్నారు.కెనడా అందించే ఏవైనా ఆధారాలు లేదా సమాచారంపై దర్యాప్తు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇతర దేశాలపై హింసకు పాల్పడడం భారత విధానం కాదని అన్నారు. ఉగ్రవాద శక్తులపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం లేదని జైశంకర్ అన్నారు.